మన జవాన్లకు శక్తినివ్వు తల్లీ..మహంకాళి టెంపుల్​ లో పూజలు

మన జవాన్లకు శక్తినివ్వు తల్లీ..మహంకాళి టెంపుల్​ లో పూజలు

పద్మారావునగర్, వెలుగు: పాక్ పై చేస్తున్న యుద్ధంలో మన ఆర్మీ జవాన్లకు మరింత శక్తి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బీజేపీ నేతలు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ సూరిటి రమేశ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ తదితరులు అమ్మవారికి ప్రత్యేక అర్చన చేశారు. కుంకుమార్చనతో పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చారు.